ఇండియా లెజెండ్స్‌.. పఠాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌

Irfan Pathan
Irfan Pathan

ముంబయి: ఇండియా లెజెండ్స్‌- శ్రీలంక లెజెండ్స్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఇండియాను కాపాడాడు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు నిధుల సేకరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం వరల్డ్‌ సిరీస్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక లెజెండ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యచేధనకు బరిలో దిగిన ఇండియా లెజెండ్స్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఇండియా లెజెండ్స్‌ కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన ఖాతా తెరవకముందే పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లందరూ వరుసగా పెవిలియన్‌ చేరడంతో ఓటమికి దగ్గరైంది ఇండియా. 81 పరుగుల వద్ద ఇండియా లెజెండ్స్‌ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. ఇక 18 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇర్ఫాన్‌ పఠాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మహారూఫ్‌ బౌలింగ్‌లో ఇర్ఫాన్‌ వరుసగా 6, 6, 4 బాదగా.. ఆఖరి బంతికి గోని (11, 8 బంతుల్లో; 1ు6) సిక్సర్‌ కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అనంతరం దిల్షాన్‌ బౌలింగ్‌లో ఇర్ఫాన్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు బాదడంతో ఇండియా లెజెండ్స్‌ సునాయాస విజయాన్ని అందుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/