తెలంగాణలోని ఆ 18 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. గత రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. లోటు ప్రాంతాలే కాదు నగరంలోని నడిబొడ్డున కూడా రోడ్లు నదులను తలపించాయి. ఎక్కడ చూసినా రోడ్లపై నీళ్లే కనిపించాయి. దాదాపు మూడు గంటల పాటు ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షానికి నగరవాసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటె రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ముఖ్యంగా రాష్ట్రంలోని 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, మహబూబాబాద్ , నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రపత్తం అయ్యారు. హైదరాబాద్ లో జీహెచ్ ఎంసీ అధికారులు రక్షణ చర్యలకు సిద్దమయ్యారు.