పూరికి ప్లాపులు కొత్తమీ కాదు – డైరెక్టర్ వినాయక్ కామెంట్స్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయినసంగతి తెలిసిందే. దీంతో చాలామంది పూరి ఫై విమర్శలు చేయడం చేసారు. అయితే పూరికి ప్లాప్స్ రావడం కొత్తమీ కాదని..లైగర్ ఫై డైరెక్టర్ వినాయక్ కామెంట్స్ చేసారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘‘పూరి ఇంతకు ముందు కూడా తను ఫ్లాపులు, హిట్స్, సూపర్ హిట్స్ చూశాడు. ఒక టైమ్లో అయితే పూరి ఇక లేడు అన్నారు. మళ్లీ పోకిరితో కొడ్తే ఏ సినిమా కనిపించలేదు. లైగర్ ఏమీ పూరి జీవితాన్ని ఏమీ మార్చేసేది కాదు. ఇప్పటికీ నాకు పోకిరి అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా స్క్రిప్ట్, మ్యూజిక్ నాకు మెస్మరైజింగ్గా అనిపిస్తాయి. సినిమాల్లో ఆర్థిక సమస్యలు సహజం. దానికి తను ప్రిపేర్ అయ్యే ఉంటాడు. ఎంత పోయింది.. ఎంత వచ్చిందనే విషయాలు తనకే తెలుస్తాయి. పూరి మళ్లీ తిరిగే లేవలేనంత అసమర్దుడేం కాదు. తన గురించి ఏదేదో మాట్లాడుతుంటే నాకు పిచ్చిగా అనిపిస్తుంటుంది. తన కెపాసిటీ నాకు, సన్నిహితులకు తెలుసు. మళ్లీ కొడితే పూరి..పూరీయే..అని వినాయక్ అన్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ చిత్రం తెరకెక్కింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీని ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేసారు.