ఒడిశా రైలు ప్రమాదానికి గల కారణాలు ఇప్పుడే చెప్పలేం‌: రైల్వే మంత్రి వైష్ణవ్

ప్రమాదంపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ వేస్తాం.. రైల్వే మంత్రి ప్రకటన

railway-minister-says-government-to-soon-set-up-committee-to-probe-odisha-rail-accident

బాలాసోర్‌: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఉన్న‌త స్థాయి క‌మిటీ విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. ఈరోజు ప్ర‌మాద ఘ‌ట‌న స్థ‌లాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా రైలు ప్ర‌మాద ప్రాంతంలో వైష్ణ‌వ్‌తో క‌లిసి తిరిగారు. క‌మీష‌న‌ర్ ఆఫ్ రైల్వే సేఫ్టీని కూడా రంగంలోకి దింపిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అస‌లు ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి కార‌ణం ఏంటో గుర్తించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం త‌మ ఫోక‌స్ మొత్తం రెస్క్యూ ఆప‌రేష‌న్‌పై ఉంద‌ని మంత్రి వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. గాయ‌ప‌డ్డ‌వారికి చికిత్స అందించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. రైలు ప్ర‌మాదంలో ఏదైనా నిర్ల‌క్ష్యం ఉందా అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న బ‌దులిస్తూ.. విచార‌ణ పూర్తి అయిన త‌ర్వాతే ఏ విష‌య‌మైనా తెలుస్తుంద‌ని మంత్రి వెల్ల‌డించారు. ఒడిశా రైలు ప్ర‌మాదంలో 238 మంది మ‌ర‌ణించారు.