తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భాంగా అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలు నివాళ్లు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భాంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. తెలంగాణ వస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని అందరూ ఆశించారన్నారు. సామజిక తెలంగాణ ఏర్పడుతుందనుకున్నాం కానీ.. తెలంగాణ ఆశయాలు ఏ మాత్రం సహకారం కాలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర సాధన లక్ష్యాలు సాధ్యమవుతాయని కాంగ్రెస్ నేతలు అన్నారు. మిగులు బడ్జెట్ పోయి … రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు , సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. సుదీర్ఘ పోరాటం లో అనేక మంది రాష్ట్రం కోసం త్యాగాలు చేశారని..రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు.

మరోపక్క టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ చొరవతో ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. రాజకీయంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. వందలాది మంది అమరుల త్యాగాల సాక్షిగా సాధించుకున్న రాష్ట్రంలో స్వపరిపాలన సుపరిపాలన అవుతుందని ఆశించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టుకుందన్నారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలిందన్నారు. అమరుల త్యాగాలకు విలువ లేకుండా విధ్వంస పాలన సాగిస్తున్న గులాబీ చీడను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని రేవంత్ అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ ఎమర్జెన్సీ పెట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. పంటలు పండక, పండిన పంటకు ప్రభుత్వ గిట్టుబాటు ధర కల్పించక తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. రైతు ఆత్మహత్యలు లేని, యువతకు ఉపాధి కల్పించి, ప్రతి అవ్వ, అయ్యకు పెన్షన్ అందించి.. ప్రతి ఆడబిడ్డకు భద్రత.. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వులు.. సకల జనుల జీవితాల్లో సంబరాలు నింపే.. వెలుగుల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వప్నమన్నారు.