20 నిమిషాల్లోనే రైలు టికెట్లు ఖతం

హౌరా ఢిల్లీ రైలులోని ఏసీ1, ఏసీ3 టికెట్లు పది నిమిషాల్లోనే ఖాళీ

train
train

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ స్టేషన్ల మధ్య ఈరోజు నుండి నుంచి రైలు సర్వీసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఐఆర్‌సీటీసీ నిన్న సాయంత్రం ఆరు గంటలకు టికెట్ల బుకింగ్ ప్రారంభించింది. 20 నిమిషాల్లోనే టికెట్లు మొత్తం హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా హౌరా ఢిల్లీ మధ్య నడిచే రైలులోని ఏసీ1, ఏసీ3 టికెట్లు కేవలం పది నిమిషాల్లోనే అమ్ముడుపోగా, మిగిలిన అన్ని టికెట్లు 20 నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. భువనేశ్వర్ఢిల్లీ రైలులోని ఏసీ1, ఏసీ3 టికెట్లు అరగంటలోనే అమ్ముడయ్యాయి. నిజానికి నిన్న సాయంత్రం నాలుగు గంటలకే విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా ఆరు గంటలకు మొదలయ్యాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/