కాంగ్రెస్​ అధ్యక్ష పదవి ఫై రాహుల్​ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ..అధ్యక్ష పదవి ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక వ్యక్తి, ఒకే పదవి నియమాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అనేది ఒక సంస్థాగత పదవి మాత్రమే కాదని.. అది ఒక సైద్ధాంతిక, నమ్మకమైన వ్యవస్థ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్ను రాహుల్ గాంధీ గుర్తు చేశారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎం కొనసాగేందుకు సిద్ధమన్న అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్​కు ఎవరు అధ్యక్షులు అయినా.. ఆ పదవి కొన్ని ఆలోచనల సమూహం అనే విషయం గుర్తుంచుకోవాలని రాహుల్​ సూచించారు.

‘మీరు చరిత్రాత్మక స్థానంలో అడుగు పెట్టబోతున్నారు.. ఆ స్థానం దేశ ఆకాంక్షను ప్రతిబింబించింది.. ఇకపై ప్రతిబింబిస్తుంది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌ పదవి ఓ ఐడియాలజికల్‌ పోస్టు అని, కొన్ని ఐడియాలకు ప్రతిరూపమని, ఓ నమ్మకమైన వ్యవస్థకు నిదర్శనమని అన్నారు. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ యూ టర్న్ తీసుకున్నారు. భారత్ జోడో యాత్రలో భాగస్వాములయ్యేందుకు కొచ్చికి వెళ్లిన ఆయన.. మాట మార్చారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే వ్యక్తి కేవలం ఒక పదవికే పరిమితం కావడం మంచిదని అన్నారు.