టిటిడి వేదపాఠశాలలో కరోనా కలకలం

57 మంది విద్యార్థులకు పాజిటివ్

covid Positive for 57 students in TTD Theological School
covid Positive for 57 students in TTD Theological School

Tirumala: తిరుమలలోని వేద పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 57 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా వేద పాఠశాలలో తరగతులు నడుస్తున్నాయి.

విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందులో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో 450 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. అయితే వారిలో 57 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వెంటనే విద్యార్థులందరినీ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/