సిరిసిల్లలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్

సిరిసిల్లలో జరిగిన రాష్ట్రస్థాయి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని చీరలను పంపిణి చేసారు. పేదింటి ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు, సిరిసిల్లలోని నేత కార్మికులకు పని కల్పించేందుకు బతుకమ్మ పండుగ సారెగా ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రతి సంవత్సరం రూ.300 కోట్లు బతుకమ్మ చీరల కోసం వెచ్చిస్తున్నామన్నారు. చేనేత కార్మికులు 40 శాతం, మరమగ్గం కార్మికులకు 10 శాతం నూలు రాయితీ ఇస్తున్నామ్నారు. టెక్స్ టైల్ పార్క్ లో జుకి మేష జనసమ్మర్దక శిక్షణ కేంద్రం పెట్టామని తెలిపారు. అపెరల్ పార్క్ లో 8 నుండి 10 వేల మంది మహిళలకు త్వరలోనే ఉపాధి కల్పిస్తున్నామన్నారు.

పక్క రాష్ట్రం తమిళనాడు తిరుప్పూర్ లో ప్రతి సంవత్సరం ప్రపంచ విపణిలో 40 వేల కోట్ల వస్త్ర ఎగుమతులు చేస్తున్నారని.. అదే సిరిసిల్లలో 2 వేల కోట్లు చేస్తున్నామని అన్నారు. న్యూజిలాండ్ లో రాజన్న సిరిపట్టు పేరుతో సిరిసిల్ల చీరలకు బ్రాండింగ్ చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసిఆర్ ఆశీస్సులతో నైపుణ్యాలు పెంచుకుంటూ, కొత్త తరహా ఆలోచనలతో తిరుప్పూర్ కు ధీటుగా సిరిసిల్లను తీర్చిదిద్దుతామని అన్నారు.

ఊరు ఊరికి, వాడవాడకి వచ్చి ప్రజా ప్రతినిధులు చీరెలను పంపిణీ చేస్తారని కేటీఆర్‌ పేర్కొన్నారు. త్వరలో స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకునేందు రూ.3 లక్షలు ఇచ్చే పథకం వెల్లడించారు. ఇదిలా ఉండగా.. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం జరిగింది. 850 మంది ఇంటర్‌ విద్యార్థులకు డిజిటల్‌ ట్యాబ్‌లను కేటీఆర్‌ పంపిణీ చేశారు. సిరిసిల్లలో 13మండలాల్లో 6వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేస్తామని, ఆకాశ్‌ బైజు సహకారంతో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ అందించనున్నట్లు చెప్పారు.