వాగ్దానాన్ని నిలబెట్టుకున్న రాహుల్‌ గాంధీ

ముగ్గురు బాలికలను హెలికాప్టర్ రైడ్ కు తీసుకెళ్లిన రాహుల్

Rahul Keeps Promise, Takes 3 Mp Girls On Helicopter Ride

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ముగ్గురు బాలికలను హెలికాప్టర్ లో తీసుకెళ్లి, వారి కోరిక నెరవేర్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గుడ్లి వద్ద ఇది జరిగింది. 20 నిమిషాల పాటు వారిని హెలికాప్టర్ లో తిప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నవంబర్ 29న ఉజ్జయినిలో రాహుల్ పర్యటిస్తున్న సమయంలో.. సీతల్ పటిదార్ అనే ఏడో తరగతి చదువుతున్న బాలిక, 10వ తరగతి విద్యార్థిని అంతిమా పన్వర్, గిరిజ పన్వర్ కలిశారు. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా వీరు తమను పరిచయం చేసుకున్నారు.

వారి కలలు, ఆకాంక్షలు, చదువుల గురించి ఆ సందర్భంలో రాహుల్ అడిగి తెలుసుకున్నారు. తాము రాహుల్ తో కలసి హెలికాప్టర్ రైడ్ చేయాలని అనుకుంటున్నట్టు వారు చెప్పారు. త్వరలోనే దీన్ని సాధ్యం చేస్తానని రాహుల్ హామీ ఇచ్చి ముందుకు సాగిపోయారు. దాన్ని ఎట్టకేలకు గురువారం నెరవేర్చారు. వారిని హెలికాప్టర్ లో ఎక్కించుకుని, టెక్నికల్ విషయాలను పైలట్ తో కలసి రాహుల్ వివరించారు. వారికి చాక్లెట్లు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఫోటోలు కూడా తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కాకుండా, తమకు నచ్చిన కెరీర్ ఎంపిక చేసుకోవాలని, అనుకున్న లక్ష్యాలను సాధించాలని రాహుల్ వారిని ప్రోత్సహించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/