బాలకృష్ణ డైరెక్టర్ కన్నుమూత

,

టాలీవుడ్ చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. అనారోగ్య సమస్యలతో కొంతమంది మరణిస్తుంటే..మరికొంతమంది రోడ్డు ప్రమాదాలలో , గుండెపోటు లతో మరణిస్తూ వస్తున్నారు. తాజాగా ఈరోజు శుక్రవారం ప్రముఖ డైరెక్టర్ శరత్‌ కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.

‘డియర్‌’ అనే నవల ఆధారంగా ‘చాద‌స్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా అడుగుపెట్టిన ఈయన..దాదాపు తెలుగులో 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా నందమూరి బాలకృష్ణ తో సినిమాలు చేయడం విశేషం. బాల‌కృష్ణ‌తో వంశానికొక్క‌డు, పెద్ద‌న్న‌య్య‌, సుల్తాన్, వంశోద్ధార‌కుడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కాగా శరత్‌ మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.