రాహుల్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో..రాహుల్ క్లబ్ ప్లెక్సీ లు వైరల్..

రాహుల్ పర్యటన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు రోజుల పాటు రాహుల్ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో రాహుల్ పబ్ కు వెళ్లిన పిక్స్ తో కూడిన ప్లెక్సీ లు హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ ఖాట్మాండులోని ఫెమస్ క్లబ్ లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను బీజేపీ నేత తజిందర్ పాల్ బగ్గా షేర్ చేయడం తో అది వైరల్ గా మారింది. ఈ వీడియో ను తెరాస పార్టీ నేతలు సైతం విపరీతంగా షేర్ చేసి పలు కామెంట్స్ చేసారు. ఇప్పుడే ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకొని రాహుల్‌ను టార్గెట్ చేస్తూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలపై రాహుల్ నైట్ క్లబ్‌లో ఉన్న ఫొటోలుండగా.. రాహుల్ వైట్ చాలెంజ్‌కు సిద్ధమేనా అంటూ రాసి ఉంది. దీంతో రాహుల్ పర్యటనుకు ముందే రాజకీయ రచ్చ మొదలైంది. మరి ఈ ప్లెక్సీ లు ఎవరు ఏర్పటు చేశారనేది తెలియాల్సి ఉంది.

ఇక రాహుల్ తెలంగాణ షెడ్యూల్ విషయానికి వస్తే..మే 6వ తేదీ సాయంత్రం 4:50కి రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 5:10కి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు. సాయంత్రం 6:05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. సభ అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 10:40 హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో స్టే చేస్తారు.

మరుసటి రోజైన శనివారం 12.30 గంటలకు తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి సంజీవయ్య పార్క్‌కు చేరుకుంటారు. 12.50-1.10 మధ్య దివంగత మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు గాంధీ భవన్ చేరుకుంటారు. 2.45 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం మెంబర్‌షిప్ కోఆర్డినేటర్లతో రాహుల్ ఫొటోలు దిగుతారు. సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.50 గంటలకు ఢిల్లీకి బయలుదేరడంతో హైదరాబాద్‌లో ఆయన పర్యటన పూర్తీ అవుతుంది.