దేశ వ్యాప్తంగా దాదాపు 14 లక్షల మందికి వ్యాక్సిన్

వ్యాక్సినేషన్ వేగవంతం

Covid vaccination in India
Covid vaccination in India

New Delhi: వ్యాక్సిన్ పంపిణీ దేశంలో జనవరి 16న మొదలై వారం రోజులు పూర్తయ్యింది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం వారం రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా దాదాపు 14 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. 

తొలి ఆరు రోజుల్లోనే వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య పది లక్షలు దాటగా, శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో మూడున్నర లక్షల మంది వరకూ టీకాలు వేసుకున్నారు.  టీకా పంపిణీ మనకన్నా ముందే ప్రారంభమైన మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా వేగంగా సాగుతోంది. 

ఇప్పటిదాకా అమెరికాలో 1.75 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. గత ఏడాది డిసెంబర్ 14న వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన ఆ దేశంలో పది లక్షల మందికి టీకాలు వేయడానికి 10 రోజులు పట్టింది.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/