ఇకపై ట్విట్టర్ ద్వేషపూరిత ప్రసంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని భావిస్తున్నాః రాహుల్‌ గాంధీ

ఎలోన్ మస్క్‌కు అభినందనలు తెలిపిన రాహుల్ గాంధీ

Rahul Gandhi hopes Twitter will ‘act against hate speech’ as he congratulates Elon Musk

న్యూఢిల్లీః ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మస్క్‌కు కంగ్రాట్స్‌ చెస్తూ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ ఇకపై విపక్షాల గొంతు నొక్కదని భావిస్తున్నట్లు చెప్పారు.

‘‘ఎలాన్‌ మస్క్‌కు అభినందనలు. ఇకపై ఆయన యాజమాన్యంలో ట్విట్టర్‌ విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, నిజ నిర్ధారణ మరింత పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా. ముఖ్యంగా భారత్‌లో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి విపక్షాల గొంతు నొక్కే చర్యలకు పాల్పడదని భావిస్తున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు. అదేవిధంగా తన ట్విట్టర్ ఖాతాలో ఇటీవల చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన ఓ గ్రాఫ్ ను ట్వీట్‌కు జత చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/