మొయినాబాద్ నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతి

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో నిందితుల రిమాండ్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితుల రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిజెక్ట్ చేయగా.. హైకోర్టు దాన్ని కొట్టేసింది. పక్కా ప్లాన్‌తో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించినట్టు పోలీసులుఆధారాలను కోర్ట్ ముందు పెట్టాగా.. హైకోర్టు ఏకీభవించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ సీపీ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. నిందితుల రిమాండ్‌కు అనుమతి మంజూరు చేస్తూ.. మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది.

బుధువారం మొయినాబాద్ రోహిత్ ఫామ్ హౌస్ లో రామచంద్రభారతి, సింహయాజులు, నంద కుమార్‌ లు టిఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యే లతో కొనుగోలు వ్యవహారం జరిపారు. ఈ వ్యహారం ఫై ఎమ్మెల్యే రోహిత్ పోలీసులకు తెలియజేయడంతో..వారు పక్క ప్లాన్ తో ఫామ్ హౌస్ ఫై ఎటాక్ చేసి రామచంద్రభారతి, సింహయాజులు, నంద కుమార్‌ లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గురువారం ఏసీబీ కోర్ట్ ముందు వారిని హాజరుపరచగా..సరైన ఆధారాలు లేవని చెప్పి వారిని విడుదల చేయాలనీ ఆదేశించింది. దీంతో సైబరాబాద్ పోలీసులు హైకోర్టు ను ఆశ్రయించారు. ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏసీబీ కోర్టు తీర్పును కొట్టేస్తూ రిమాండ్‌కు అనుమతి మంజూరు చేసింది.