కూలిన విమానం.. 8 మంది మృతి

మిలాన్‌: ఇట‌లీలోని మిలాన్ న‌గ‌రంలో ఓ ప్రైవేటు విమానం కూలింది. ఖాళీగా ఉన్న ఓ బిల్డింగ్‌ను ఆ విమానం ఢీకొట్టింది. మిలాన్‌లోని లినేట్ విమానాశ్ర‌యం నుంచి స‌ర్డినియా దీవికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మర‌ణించారు. రొమేనియాకు చెందిన బిలియ‌నీర్ డాన్ పెట్రెస్కూ ఆ విమానానికి పైలెట్‌గా ఉన్నారు.

ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్య‌, కుమారుడు ఉన్నారు. విమానం కూలిన బిల్డింగ్ వ‌ద్ద ఆఫీసు ధ్వంస‌మైంది. అక్క‌డ ఉన్న కార్ల‌కు నిప్పు అంటుకున్న‌ది. ఈ ప్ర‌మాదంపై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. సింగిల్ ఇంజిన్ పీసీ-12 విమానం గాలిలో ఉన్న‌ప్పుడే మంట‌లు అంటుకున్న‌ట్లు సాక్ష్యులు తెలిపారు. డాన్ పెట్రెస్కూ ఓ ప్రాప‌ర్టీ డెవ‌ల‌ప‌ర్‌. ఆయ‌న రొమేనియాలో సంప‌న్నుడు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/