పవన్ కళ్యాణ్ ఆప్షన్ల ఫై సోము క్లారిటీ

somu veerraju

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి పొత్తుల ఫై క్లారిటీ ఇచ్చారు. నిన్న శనివారం జరిగిన జనసేన పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతూ..తాను ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చి..ప్రజలను గెలిపించానన్నారు. పార్టీ సమావేశంలో ఆయన పొత్తుల గురించి మాట్లాడుతూ…2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీతో కలిసి ప్రజల కోసమే పని చేసానని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో తగ్గే ఒక స్టేట్ మెంట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. కానీ, 2024 ఎన్నికల్లో మాత్రం ఒక తగ్గేది ఉండదని తేల్చి చెప్పారు. అలాగే తాను మూడు ఆప్షన్ల ను తెలిపారు. రాష్ట్రంలో జనసేన ముందు ఇప్పుడు మూడు మార్గాలు ఉన్నాయని ప్రకటించారు.

అందులో ఒకటి బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం. రెండోది టీడీపీ – జనసేన కలిసి ప్రభుత్వం స్థాపించటం. మూడోది జనసేన ఒంటరిగా అధికారంలోకి రావటమని తేల్చి చెప్పారు. పొత్తుల విషయంలో తానే కాదని..టీడీపీ కూడా తగ్గాల్సిన అవసరం ఉందని విస్పష్టంగా చెప్పారు. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము స్పందించారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లలో మొదటి దానిని తామే పరిగణనలోకి తీసుకుంటామని, రెండో ఆప్షన్ గురించి టీడీపీనే అడగాలని మీడియాకు సూచించారు. పవన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, ఆత్మకూరు ఉప ఎన్నిక ద్వారా దీనికి సమాధానం చెబుతామని అన్నారు. కుటుంబ రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టడమే తమ లక్ష్యమని అన్నారు. వైసీపీ తీరును అందరూ తప్పుబడుతున్నారని, అందుకనే తాము ఆత్మకూరు బరిలో దిగినట్టు వివరణ ఇచ్చారు.