ప్రజా సమస్యలపై రాహుల్ పోరాటం – రేవంత్

దేశంలో ఉన్న ప్రజా సమస్యలపై రాహుల్ పోరాటం చేస్తున్నారని , ఇంత అద్భుతమైన పాదయాత్రను ఎవరూ చేయలేరని , ఓ పక్క ఈడీ వేధిస్తున్నా కూడా రాహుల్ పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్య పరచడానికి నడుబిగించారని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర రీసెంట్ గా తెలంగాణ లో పూర్తి చేసుకొని , మహారాష్ట్రలో మొదలైంది. తెలంగాణ లో చేపట్టిన రాహుల్ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పట్టారు. రాహుల్ సైతం ప్రతి చోట ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక చివరి రోజు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద రాహుల్ యాత్ర వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సభ లో రాహుల్ మాట్లాడుతూ ఎమోషనల్ కు గురయ్యారు. రాష్ట్రాన్ని విడిచి వెళ్తుంటే బాధగా ఉందని .. రాష్ట్రంలో కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారన్న ఆయన… దెబ్బలు తాకినా, అనారోగ్యానికి గురైన పట్టుదలతో వారు పనిచేయడం భావోద్వేగానికి గురైనట్లుగా రాహుల్ వెల్లడించారు. దీన్ని మీడియాలో చూపించినా, చూపించకపోయినా తన కళ్లతో చూస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో తనని కలిసిన ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడన్నారు. తెలంగాణ గళాన్ని ఒక చోట నొక్కేస్తే ఇంకో ప్రాంతం నుంచి వినిపిస్తుందని దానిని ఎవ్వరూ అణచివెయ్యలేరన్నారు. ఇక్కడ చేసిన పాదయాత్రను ఎప్పటికీ మరిచిపోనని రాహుల్ చెప్పుకొచ్చారు.

బుధువారం రాహుల్ పాదయాత్ర ఫై రేవంత్ మాట్లాడారు. రాహుల్ కు స్వాగతం పలికి, ఆయన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి పార్టీ అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఉన్న ప్రజా సమస్యలపై రాహుల్ పోరాటం చేస్తున్నారని, ఇంత అద్భుతమైన పాదయాత్రను ఎవరూ చేయలేరన్నారు. ఈడీ వేధిస్తున్నా కూడా రాహుల్ పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్య పరచడానికి నడుంబిగించారన్నారు.. మోడీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారని తెలిపారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో చాలా స్పూర్తిని నింపిందన్నారు. సూర్యుడి వెలుగుల నడుమ ఉదయించే కిరణంలా రాహుల్ గాంధీ రాష్ట్రంలోకి అడుగుపెట్టారని రేవంత్ చెప్పుకొచ్చారు.