హైద‌రాబాద్ మహానగరంలో కుండపోత

గాలులకు నేలకొరిగిన చెట్లు , వాహనదారుల ఇబ్బందులు

Heavy rain in Hyderabad
Heavy rain in Hyderabad

Hyderabad: హైద‌రాబాద్ మహా నగరంలో బుధవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది.మ‌ధ్యాహ్నం వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. సాయంత్రంవ‌ర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, కొండాపూర్, ఖైర‌తాబాద్‌, నాంప‌ల్లి, అమీర్‌పేట‌, సోమాజిగూడ‌, పంజాగుట్ట‌, కూక‌ట్‌ ప‌ల్లి, మియాపూర్, బేగంపేట‌, సికింద్రాబాద్, ఉప్ప‌ల్, బోయిన్‌ప‌ల్లి, ఎల్బీన‌గ‌ర్‌, హ‌య‌త్‌న‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, చార్మినార్‌, మెహిదీప‌ట్నం, అఫ్జ‌ల్‌ గంజ్, ల‌క్డికాపూల్, టోలిచౌకి, రాంన‌గ‌ర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం పడింది. బలమైన గాలులకు ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. చెట్లు నేల‌కొరిగాయి. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/