ఈ నెల 12 న ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రద్దు చేసిన తెలంగాణ సర్కార్

The Telangana government has canceled the holiday on 12th of this month

Community-verified icon


మాములుగా రెండో శనివారం నాడు ప్రభుత్వ ఆఫీస్ లకు , స్కూల్స్ కు సెలవు ఉంటుంది కానీ ఈ నెల 12 న మాత్రం సెలవును రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఈ సెలవు రాష్ట్రం మొత్తం కాదు. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు ఈ నెల 12వ తేదీన పని చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవులగా ప్రకటించింది. అందుకు బదులుగా ఈ నెల 12న సెలవులను రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ టెన్త్ విద్యార్థులకు ముఖ్య గమనిక. పరీక్షలపై ఎస్ఎస్సీ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఫైనల్ ఎగ్జామ్స్ ను వచ్చే మార్చిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా టెన్త్ ఎగ్జామ్స్ లో మొత్తం 11 పేపర్లు ఉంటాయి. హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు 2 పేపర్ల చొప్పున ఉంటాయి. అయితే ఈ సారి ప్రతీ సబ్జెక్టుకు ఒకటి చొప్పున మొత్తం 6 పేపర్లతో పరీక్ష ఉంటుందని ఇప్పటికే బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది వర్షాలు తదితర కారణాలతో సెలవులు ఎక్కువగా వచ్చాయి. ఇంకా.. విద్యార్థులకు బుక్స్ సైతం ఆలస్యంగా అందించారు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుందని అంతా భావించారు. కానీ.. ముందుగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. మార్చి చివరి వారంలోనే ఎగ్జామ్స్ ఉంటాయని SSC బోర్డ్‌ క్లారిటీ ఇచ్చింది.