కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా రాహుల్..?

Rahul Gandhi promises caste census, removal of 50% cap on reservation if INDIA bloc voted to powe

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 99 ఎంపీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ గత 10ఏళ్లలో మొదటిసారి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందనుంది. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ హోదాను స్వీకరించాలని పార్టీలోని ఓ వర్గం బలంగా కోరుతోంది. నేడు జరిగే CWC, పార్లమెంటరీ పార్టీ భేటీల్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు ఢిల్లీలో నేడు CWC భేటీ జరగనుంది. ఉ.11గంటలకు ఇది మొదలుకానుంది. ఈ భేటీకి సోనియా, ప్రియాంక, రాహుల్తో పాటు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకులు, పీసీసీ అధ్యక్షులు హాజరవుతారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అందరికీ విందు ఇవ్వనున్నారు. సాయంత్రం 5.30గంటలకు పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుంది.