బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలసల పర్వం కొనసాగుతుంది. అధికార పార్టీ లోని నేతలు కాంగ్రెసులోకి , కాంగ్రెస్ పార్టీ నేతలు బిఆర్ఎస్ లోకి జంప్ చేస్తున్నారు. ఈసారి ఎక్కువగా బిఆర్ఎస్ పార్టీ కి షాకులు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు. ఇప్పటీకే కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా..తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాగిడి లక్ష్మారెడ్డి..కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

మేడ్చల్‌ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌..ఆయనకు బిఆర్ఎస్ కండువా కప్పు పార్టీ లోకి ఆహ్వానించారు. కాగా, అంతకుముందు ప్రగతి భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాగిడి ల‌క్ష్మారెడ్డి బుధ‌వారం క‌లిశారు. ఉప్పల్‌ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ ల‌క్ష్మారెడ్డి..త‌న‌కు గౌర‌వం లేని కాంగ్రెస్ పార్టీలో ఉండ‌లేనని, బీఆర్ఎస్ పార్టీలో చేరుతాన‌ని ల‌క్ష్మారెడ్డి ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే గద్వాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి సైతం కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు. గద్వాల్ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రభాకర్..నేడు స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.