వైజాగ్ వైసీపీ ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి..?

మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ YSRCP విజయం వైపు సన్నాహాలు చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా 175కు 175 స్థానాల్లో విజయం సాధించి మరోసారి సీఎం కావాలని జగన్ చూస్తున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లోను విజయం సాధించాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇచ్చేందుకు జగన్ ఉత్సాహం చూపించడం లేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేక దృష్ట్యా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేల కాకుండా కొత్త వారికి టికెట్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. దీంతో టికెట్ రాని నేతలంతా ఇతర పార్టీలలో చేరెందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది టీడీపీ,
జనసేన పార్టీలలో చేరగా మరికొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మీకి విశాఖపట్నం లోక్ సభ టికెట్ ఇచ్చేందుకు అధినేత జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. వైసిపి తరఫున వైజాగ్ నుండి పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఫైనల్ గా ఆమె పేరును జగన్ అనుకున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమె విజయనగరం నుంచి గతంలో ఎంపీగా పని చేశారు. విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీబీవీ సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగిపోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఝాన్సీ పేరు తెరపైకొచ్చింది. ఆమెను విశాఖలో సభకు పోటీ చేయించే విషయంలో అతి త్వరలోనే జగన్ ప్రకటన చేయనున్నారని సమాచారం.