జగ్జీవన్ రామ్ కు సిఏం జగన్ ఘన నివాళి
హాజరైన మంత్రులు, అధికారులు

Amravati: భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 113వ జయంతి ని సోమవారం ఘనం గా నిర్వహించారు.తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మంత్రులు మేకతోటి సుచరిత, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘరామ్, తదితరులు పాల్గొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/