రఘురామరాజు టికెట్ లేనట్లేనా..?

వైసీపీ మాజీ ఎంపీ..రఘురామరాజు ఈసారి నరసరావుపేట నుండి బరిలోకి దిగబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. కాకపోతే అది ఏ పార్టీ అనేది చెప్పలేదు. అంత బిజెపి నుండి ఆయన బరిలోకి దిగబోతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ బిజెపి మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ధైర్యం చేయడం లేదని సమాచారం.

రఘురామరాజుకు టికెట్‌ ఇవ్వకూడదని..అతనిపై గ్రౌండ్‌ రిపోర్టు బాగాలేదని బీజేపీ పార్టీ గుర్తించిందట. ఏపీలో బిజేపిఎంపీ అభ్యర్థుల అంచనా ప్రకారం… నరసాపురం నుంచి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మ పేర్లు పరిశీలిస్తున్నారట. రాజమండ్రి- పురంధేశ్వరి, అనకాపల్లి- సీఎం రమేష్, రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి- మాజీ ఐఎఎస్ వరప్రసాద్ లేదా రత్నప్రభ పేర్లు ప్రచారంలో ఉన్నాయట. అరకు నుంచి కొత్తపల్లి గీత బరిలో ఉంటారట. అయితే.. ఈ లిస్టులో రఘురామరాజు లేదని సమాచారం.