అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు

కేజ్రీవాల్ ను టెర్రరిస్టు అని నేనెప్పుడూ పిలవలేదు

PRAKASH JAVADEKAR
PRAKASH JAVADEKAR

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ను టెర్రరిస్టుగా సంబోధించారంటూ వచ్చిన వార్త లపై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పందించారు. తానెప్పుడూ కేజ్రీవాల్ ను టెర్రరిస్ట్ అని పిలవలేదని జవదేకర్ చెప్పారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పూర్తిగా ఉనికిని కోల్పోవడం వల్లే ఆప్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తానేమైనా టెర్రరిస్టునా? అని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ అడుగుతుంటారని… ఆయన టెర్రరిస్టేనని, అందుకు చాలా ఆధారాలు ఉన్నాయని జవదేకర్ గతంలో అన్నారు. ‘తాను అరాచకవాదినని మీకు మీరే చాలా సార్లు చెప్పారు. అరాచకవాదికి, టెర్రరిస్టుకు పెద్ద తేడా ఏమీ లేదు’ అని ఎన్నికల సమయంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నాన్ని జవదేకర్ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/