సిరాజ్ ఆట తీరుపై దర్శక ధీరుడి ప్రశంసలు

మహ్మద్‌ సిరాజ్ ఇప్పుడు ఈ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోతుంది. ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ ఒంటి చేత్తో టీం ఇండియా ను గెలిపించాడు. దీంతో క్రికెట్ అభిమానులంతా సిరాజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంకను హైదరాబాదీ బౌలర్ సిరాజ్ చుక్కలు చూపించాడు. ఆరు వికెట్లు తీసి లంక వెన్ను విరిచాడు.

దీంతో సోషల్ మీడియాలో సిరాజ్ ట్రెండింగ్ లో నిలిచాడు. సిరాజ్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అతడి ఆటను ప్రశంసిస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి సిరాజ్ సంచలనంపై ట్వీట్ చేశాడు. సిరాజ్ ఆడిన ఆట తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ” సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు.. ఆసియా కప్ ఫైనల్‌లో 6 వికెట్లతో మెరిశాడు. అంతేకాకుండా తన సొంత బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్‌కు పరిగెత్తుతున్న పెద్ద హృదయాన్ని కలిగి ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.