వైఎస్‌ఆర్‌సిపి పాలనలో అవినీతిపై హైకోర్టులో రఘురామ పిటిషన్‌

ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందో పిటిషన్ లో వివరణ

raghurama-approaches-high-court-seeking-cbi-probe-on-ycp-administration

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి నాలుగున్నరేళ్ల పాలన అవినీతిమయం అని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్ పై ఉన్న కేసుల విషయం తేల్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ… తాజాగా, వైఎస్‌ఆర్‌సిపి పాలనలో చోటుచేసుకున్న అవినీతి నిగ్గు తేల్చాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.

సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆరోపించారు. ఈ మేరకు ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందన్న విషయాన్ని రఘురామ వివరంగా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజాధనానికి నష్టం కలిగించేలా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. సాక్షి పత్రిక, సాక్షి చానల్ కు లబ్ది కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. సీఎస్ సహా పలువురు ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా రఘురామ తన పిటిషన్ లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.