మా ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న సీవీఎల్‌

హైదరాబాద్: అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు సీవీఎల్‌ నరసింహారావు పోటీ నుంచి తప్పుకున్నారు. కాసేపటి క్రితమే మేనిఫెస్టో ప్రకటించిన ఆయన అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మా అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీని వెనుక కారణం ఉందని, రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి ఆ వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు.

తనకు అధ్యక్ష పదవి కంటే మా సభ్యుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తను ప్రకటించిన మేనిఫెస్టో అమలు అయ్యేందుకు చూస్తానని సీవీఎల్‌ పేర్కొన్నారు. ఇప్పుడు పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవరికీ మద్ధతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/