నరేంద్రకు అస్వస్థత

చికిత్స అందించాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్

D.Narendra
D.Narendra

Rajamahendravaram: తెదేపా సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డైరీ మాజీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం రాత్రి నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. నరేంద్రను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని., ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కాగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్‌లో ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కరోనా పాజిటివ్ రావటంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా నరేంద్రకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/