కరోనా వ్యాప్తిచెందకుండా ఆర్బీఐ మాజీ గవర్నర్‌ సలహా

వైరస్‌ వ్యాప్తికి పరిమితి ఉందనే భావన ప్రజల్లో కలిగించాలి

raghuram rajan
raghuram rajan

చికాగో: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్‌ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ పలు కీలక సూచనలు చేశారు. వైరస్‌ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే ప్రస్తుతం ఉత్తమమైన ఆర్థిక ఔషధమని, ప్రోత్సాహకాల గురించి తర్వాత ఆందోళన చెందవచ్చని అన్నారు. ఈ విషయంలో కేంద్ర బ్యాంకులు చేయగలింది కొంతేనని పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తికి పరిమితి ఉందనే భావన ప్రజల్లో కలిగించాలి. అప్పుడే దాన్ని నివారించేందుకు ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశ ప్రజల్లో ఉంటుంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు ప్రోత్సాహకాల గురించి ఆందోళన చెందకుండా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఒక్క వారంలోనే మార్కెట్లపై విశ్వాసం కోల్పోయి ఆందోళనకు గురయ్యాం. సరఫరా, సౌకర్యాల ఉత్పత్తులపై కంపెనీలను వైరస్‌ ప్రభావం ఆలోచనలో పడేసింది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుంది అని రాజన్‌ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/