ప్రారంభమైన జీఎస్టీ మండలి సమావేశం
కొవిడ్, బ్లాక్ ఫంగస్ మందులు, పరికరాలపై పన్నులు తగ్గించే చాన్స్
Finance-Minister-chairing-the-44th-GST-Council-meeting
న్యూఢిల్లీ: 44వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్, కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా కొవిడ్ అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను గురించి చర్చిస్తున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/