ఈడీ ఆఫీస్ కు ఎమ్మెల్యే రఘునందన్ రావు

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారం తో బిజెపి కి ఎలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు చెపుతుంటే..టిఆర్ఎస్ మాత్రం మొదటి రోజు బిజెపి ఫై ఆరోపణలు చేసి..ప్రస్తుతం సైలెంట్ అయ్యింది. ఇక ఈ వ్యవహారం ఫై బిజెపి సీరియస్ గా ఉంది. ఇప్పటికే హైకోర్టు లో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది బిజెపి. మరోవైపు శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రికి వెళ్లి.. లక్ష్మీనర్సింహ స్వామి ఎదురుగా ప్రమాణం చేశారు.

ఇదిలా ఉంటే.. వ్యక్తిగతంగా లాయర్ అయిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మొయినాబాద్‌ ఫామ్‌ హౌజ్‌ ఎపిసోడ్‌ కేసులో జోక్యం చేసుకోవాలని ఈడీని కోరినట్లు తెలిపారు. దీనిపై చర్యలు చేపడతామని ఈడీ అధికారులు రఘునందన్ రావుకు తెలిపినట్లు సమాచారం. ఎలాంటి ఆధారాలు లేకుండా బీజేపీ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఆయన ప్రవర్తించారని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకులు ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేశారు.