అప్పుడే రాజీనామా చేస్తా : రఘురామ

నావల్ల కాదు నువ్వే రాజీనామా చేయి అని సీఎం జగన్ అనాలి.. రఘురామకృష్ణరాజు

ఢిల్లీ : వైస్సార్సీపీ తో ఎంపీ రఘురామకృష్ణరాజు పోరాటం కొనసాగుతోంది. ఆయనపై అనర్హత వేటు వేయించాలని వైస్సార్సీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పార్టీకి ఆయన రాజీనామా చేయాలంటూ వైస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రఘురామ స్పందించారు. ఫిబ్రవరి 5న తాను రాజీనామా చేస్తానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

అయితే, తనపై అనర్హత వేటుకు ఈ నెల 11 వరకు వైసీపీ నేతలకు సమయం ఇచ్చానని వెల్లడించారు. ఒకవేళ… ఇక నా వల్ల కాదు, నువ్వే రాజీనామా చేయి అని సీఎం జగన్ చెబితే అప్పుడు రాజీనామా చేస్తానని రఘురామ వివరించారు. రాజీనామా విషయంలో తాను స్పష్టతతోనే ఉన్నానని ఉద్ఘాటించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/