వాహనం మార్చండి.. లేదా మీరే తీసుకెళ్లండి.. ఐజీకి రాజాసింగ్ లేఖ

నాకు ప్రాణహాని ఉందని తెలిసినా ఇలాంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిస్తరా?

mla-raja-singh-letter-to-telangana-intelligence-inspector-general-over-bulletproof-vehicle

హైదరాబాద్ః ఇంటెలిజెన్స్ ఐజీకి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికిల్ ..తరచూ రిపేర్లకు గురవుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చినప్పడు..తనకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇవ్వొద్దని చెప్పారా… లేక మీరే ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. కొత్త వెహికల్ ఇవ్వకపోతే..పాతదాన్ని తీసుకోవాలని ఐజీని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం తనకు కేటాయించిన 13 ఏండ్ల నాటి పాడైన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించడం సిగ్గు అనిపిస్తుందని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తంచేశారు. రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతూ తరచూ ఇబ్బందులు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కండీషన్ లో లేకపోవడంతో గోషామహల్ నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు వెళ్లలేక ఆటంకాలు కల్పిస్తుందన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ఒక ఎమ్మెల్యేకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వలేకపోయారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/