ప్రసార మాధ్యమాలలో రేడియోది చెరగని ముద్ర

ప్రసార మాధ్యమాలలో గొప్పగా పేర్కొనబడుతున్న ఎలక్ట్రానిక్‌ మాధ్యమం రేడియో అని చెప్పకతప్పదు. సమస్త సమాచారం వినోదం అందించడంలో రేడియో ప్రధాన భూమికగా పేర్కొనబడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వ రంగ ఆల్‌ ఇండియా రేడియో ఎఫ్‌ఎమ్‌ రేడియో కేంద్రాలు 39 శాతం తమ ప్రసారాలను విస్తరిస్తున్నాయి.అదేవిధంగా 52 శాతం ప్రజలు ఆల్‌ ఇండియా రేడియో ప్రసారాలను వింటున్నట్లు సర్వే ద్వారా తెలుస్తుంది.

ప్రైవేట్‌ రంగ ప్రసార మాధ్యమాలలో లేడీస్‌ స్పెషల్‌ కూడా నెలకొల్పడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో 369 ప్రైవేట్‌ రేడియో స్టేషన్లు 101 పట్టణాలలో తమ ప్రసారా లను అందిస్తున్నాయి. మాధ్యమాలు అనగానే పత్రికలు, రేడియో, టివీ, సినిమా, సామాజిక మాధ్యమం నేడు అందుబాటులో ఉన్నా యి. ఒకప్పుడు వార్తలను వేయడానికి ఎన్నో ఇబ్బందులను ఎదు ర్కోవాల్సిన పరిస్థితులు ఉండేవి. నేడు ఆ ఇబ్బందులు లేకుండా పోయాయి. భారతీయసామాజిక వ్యవస్థలో రేడియో విడదీయరాని బంధంగా ఒక అత్యంత గౌరవప్రదమైన వస్తువ్ఞగా ఉండేది.

అప్పట్లో ఎవరైనా ఇంట్లో రేడియో ఉన్నదంటే సమాజంలో ఆర్థికంగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందేవాడు. రేడియో పుట్టుకను ఒకసారి గమనిస్తే విద్యుత్‌ ఆయస్కాంత శక్తిగల రేడియో, తరం గాలను తొలుత జర్మన్‌ భౌతిక శాస్త్రవేత్త హెర్నియాహెడ్‌ 1886 లో గుర్తించాడు. దశాబ్దం తర్వాత 1895-96 నాటికి రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఆచరణలో సాధించిన వారు ఇటాలియన్‌ శాస్త్రవేత్త మార్కోని రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెర్నియాహెడ్‌ పేరిట రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ మొదలైంది. ఆ తర్వాత రేడియో ప్రసారాలు విజయవంతం కావ డంతో ప్రసార కేంద్రాల ఆవిర్భావానికి దారి తీశాయి.

20నవంబర్‌ అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్‌ ఎన్నికయ్యారు అన్న వార్త మొదట పిట్స్బర్గ్‌ కేంద్రం నుండి ప్రసారం అయింది. రేడియో ప్రసారాలపై ఆసక్తి కనబరచిన తొలి యూరోపియన్‌ దేశం ఇంగ్లాండ్‌ అయినా ప్రభుత్వ ఆంక్షల కారణంగా కొంత ఆలస్యంగా అక్కడ రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. అరడజను కంపెనీలు కలిసి 1922 లో బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ బిబిసి స్థాపించాయి. నవం బర్‌ 14 నుండి లండన్‌ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభిం చింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా రేడియో మొబైల్లో సులభంగా వాడుకలోకి వచ్చింది.

వార్తాపత్రికలు చదవాలంటే చదువ్ఞ రావాలి. కానీ రేడియో అక్షరాస్యత లేని వారు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా వార్తా ప్రసారాలను అందించేది. ప్రసార మాధ్య మాలలో కీలక భూమిక పోషించే రేడియోను వినియోగించుకునే అవకాశం మొదట్లో అందరికీ ఉండేదికాదు. పైన పేర్కొన్నవిధంగా సామాజికంగా, ఆర్థికంగా ఎదిగిన వారే రేడియోను కొనుగోలు చేసుకునేవారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా రేడియో దినోత్సవం జరుపుకోవాలని 1910లో ప్రయత్నాలు జరిగినా ఆ ప్రక్రియ ప్రారంభం కావడానికి ఎంతో కాలం పట్టింది. 2013 నుంచి పెద్దఎత్తున జరుపుకోవడం మొదలైంది. టెక్నాలజీ విపరీతంగా పెరగడంతో సమాచార సాధానాలు బాగా పెరిగాయి.

ఈ నేపథ్యం లో రేడియోను మళ్లీ సమాజంలో పరిచయం చేయాలని అన్ని చరవాణి కంపెనీలు ఆలోచన చేసి తమ మొబైల్‌లో రేడియోను వినియోగించుకునే అవకాశం కల్పించారు. 1946 ఫిబ్రవరి 13న యునెస్కో రేడియో దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 2013 నుంచి ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో ఈ ప్రపంచ రేడియో దినోత్సవాలు జరుపుకోవడం ప్రారంభమైంది. ప్రస్తుత అవసరా లకు అనుగుణంగా మరింత ప్రయోజనకరంగా ఉండాలంటే రేడియోను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

2017 లో రేడియో దినోత్సవ కార్యక్రమంగా గుర్తించారు. తొలినాటి రేడియో సెట్లలో ఇప్పటి మాదిరిగా లౌడ్‌స్పీకర్లు ఉండేవికావ్ఞ. అప్పటి రేడియో నమూనాలను క్రిస్టల్‌ నెట్‌ అనేవారు. ఇదిచాలా సున్నితమైన పరికరం.తెలుగులో తొలి రేడియో ప్రసారాలు 1938 జూన్‌ 16న ప్రారంభమైనాయి. రేడియో ప్రసారాల్లో ఫ్రీక్వెన్సీ పెర గడం వల్ల ఎంత దూరమైనా సమాచారం అందుతుంది. శాటిలైట్‌ రేడియోలు, ఇంటర్నెట్‌ రేడియోలు కూడా ఇప్పుడు అందుబాటు లోకి వచ్చాయి. అమెరికాలోని బెల్‌టెలిఫోన్‌ ప్రయోగశాలలో పని చేసే పరిశోధక బృందం 1948లో తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేసింది. టార్చ్‌లైట్‌లో వాడే బ్యాటరీలతో ట్రాన్సిస్టర్‌ కొన్ని నెలల పాటు పనిచేసే వెసులుబాటు ఉండటంతో రేడియో వినియోగం ప్రజలకు మరింత దగ్గరయింది.

అప్పుడే రేడియోప్రసారాలు సామా న్యులకు అందుబాటులోకి వచ్చాయి. భారతదేశంలో మొదటి రేడియో స్టేషన్‌ బ్రిటిష్‌ హయాంలో తొలి రేడియోస్టేషన్‌ బాంబేలో ప్రారంభమైంది.ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీనెలకొల్పిన రేడియో స్టేషన్‌ అప్పటి వైస్రాయి లార్డ్‌ఇర్విన్‌ 1927జులై 23న ప్రారంభిం చారు.ఇది దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభిం చింది. ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ 1936లో ఆల్‌ ఇండియా రేడియోగా మారింది.

ఆల్‌ ఇండియా రేడియో ఏర్పడిన రెండేళ్లకు 1938జూన్‌ 16న మద్రాస్‌లో రేడియో స్టేషన్‌ ప్రారంభం కావడం తో అప్పటినుంచి తెలుగులో రేడియో ప్రసారాలుమొదలయ్యాయి. హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కు వగా ఉర్దూలో ఉండేవి. దీనికి 1939లో దక్కన్‌ రేడియోగా పేరు మార్చారు.రేడియోస్టేషన్‌ నుంచి తెలుగు, కన్నడ, మరాఠీ భాషలో కూడా ప్రసారాలు సాగేవి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లల్లో 1950లో భారత ప్రభుత్వం డెక్కన్‌ రేడియో స్టేషన్‌ నిజాం నుంచి స్వాధీనం చేసుకుని ఆల్‌ ఇండియా రేడియో ఆకాశవాణి పరిధిలోనికి తెచ్చింది. విశాఖపట్నం, కడపలో 1963లో ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌లు ప్రారంభమయ్యాయి.

తర్వాత కాలంలో కర్నూలు తిరుపతి అనంతపూర్‌ కొత్తగూడెం, నిజామా బాద్‌, వరంగల్‌ ఆదిలాబాద్‌ లో కూడా ఆల్‌ ఇండియా రేడియో కేంద్రాలను ప్రారంభించారు.2006 వరకు రేడియో కేంద్రాలను భారత ప్రభుత్వమే నడిపింది. ప్రస్తుతం ఆకాశవాణి కేంద్రాలతో పాటు ప్రైవేట్‌రంగసంస్థల కేంద్రాలు విస్తృతంగా నెలకొల్పబడ్డాయి. ఇవన్నీ కూడా ఎఫ్‌ఎం కేంద్రాలుగానే కొనసాగుతున్నాయి.

  • డాక్టర్‌ ఆర్‌. ఆదిరెడ్డి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/