రాధే శ్యామ్ నుండి “నగుమోము” ఫుల్ సాంగ్ రిలీజ్..డార్లింగ్ మాములుగా లేడు

రాధే శ్యామ్ నుండి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ “ఈ రాతలే” అంటూ సాగే ప్రేమ గీతం విడుదలై ఆకట్టుకోగా..ఈరోజు గురువారం “నగుమోము” అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసి ఆకట్టుకున్నారు.

‘వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్’ పేరుతో ‘రాధే శ్యామ్’ హిందీ వెర్సన్ నుంచి బుధవారం విడుదలైన ‘ఆషికీ ఆ గయీ’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ”నగుమోము తారలే” అనే గీతాన్ని రిలీజ్ చేశారు. నేను రోమియోని కాదని ప్రభాస్ చెప్పగా.. ‘కానీ నేను జూలియట్ ని.. నాతో ప్రేమలో పడితే చస్తావ్’ అని పూజా అనడంతో ఈ పాట మొదలవుతుంది.

‘నగుమోము తారలే.. తేగిరాలే నేలకే.. ఒకటైతే మీరిలా.. చూడాలనే.. సగమాయే ప్రాయమే.. కదిలేను పాదమే.. పడసాగే ప్రాణమే.. తన వెనకే’ అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను , అభిమానులను విశేషంగా అలరిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించగా .. మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తనదైన వాయిస్ తో మరోసారి మ్యాజిక్ చేశారు. జనవరి 14 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.

YouTube video