‘సలార్’ నుండి పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రభాస్ నటిస్తున్న సలార్ నుండి పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్రభాస్ పోస్ట‌ర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. కాగా ఈ సినిమా టీజర్‌ను దీపావళికి గాని, ప్రభాస్‌ బర్త్‌డేకు గాని రిలీజ్‌ చేయనున్నట్లు టాక్. ఈ తరుణంలో ఈరోజు మలయాళ స్టార్‌ పృథ్విరాజ్‌ సుకుమారన్‌ పుట్టిన రోజు సందర్బంగా అయన తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది మేకర్స్.

ఈ చిత్రంలో పృథ్విరాజ్‌ ‘వర్ధరాజ మన్నార్‌’గా నటించనున్నాడు. రీసెంట్‌గా విడుదలైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. పోస్టర్‌ను గమనిస్తే పృథ్విరాజ్‌ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.