రేపు ఢిల్లీకి చంద్రబాబు..

chandrababu

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ ఆఫీసుల ఫై అలాగే టీడిపి నేతల ఇళ్ల ఫై వైసీపీ కార్య కర్తలు చేసిన దాడిఫై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు పిర్యాదు చేయబోతున్నారు. ఈ మేరకు 18 మందితో కూడిన తెలుగుదేశం నేతల బృందం రేపు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవనుంది.

సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా ఖరారైంది. నిజానికి ఢిల్లీకి 18 మంది బృందం వెళ్తున్నప్పటికీ కరోనా నేపథ్యంలో చంద్రబాబు సహా ఐదుగురికి మాత్రమే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభించింది. ఇక ఢిల్లీకి వెళ్లనున్న నేతల్లో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, ఎంపీలు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే ఉండే ఈ నేతలు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా వారి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పెరిగిపోయిందని, డ్రగ్స్, గంజాయి సాగుకు ఏపీ కేంద్రంగా మారింద‌ని టీడీపీ ఈ సందర్భంగా ఆరోపించింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది.