టీడీపీ నేత పట్టాభి కనిపించడం లేదు

టీడీపీ నేత పట్టాభి కనిపించడం లేదు

వైసీపీ ప్రభుత్వం ఫై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయినా టీడీపీ నేత పట్టాభి..శనివారం బెయిల్ ఫై బయటకు వచ్చారు. రాజమండ్రి జైలు నుండి విజయవాడ కు బయలుదేరారు. అయితే ఇంతవరకు ఆయన ఇంటికి చేరుకోకపోవడం తో కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. పోలీసుల అదుపులోనే పట్టాభి ఉన్నాడంటూ అటు కార్యకర్తలు ఆరోపణలు చేస్తుండగా…తమ అదుపులో లేడంటున్నారు పోలీసులు. పట్టాభి వేరే ప్రాంతం లోనే సురక్షితంగానే ఉన్నాడని కొంతమంది టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.

మరోపక్క పట్టాభి ఇంటిపై అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఫై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మందిని, పట్టాభి నివాసంపై దాడి ఘటనలో 11 మందిని అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై పల్లపు మహేశ్, గోక దుర్గాప్రసాద్, షేక్ అబ్దుల్లా, శేషగిరి, పానుగంటి చైతన్య, జోగ రమణ, పేరూరి అజయ్, అడపాల గణపతి, కోమటిపల్లి దుర్గారావు, పవన్ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.