బిజెపి నేత రఘునందన్ పై సంచలన ఆరోపణలు

కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళలను భయపెట్టి లొంగదీసుకుంటాడు

radha-ramani-sensational-comments-raghunandan-rao
radha-ramani-sensational-comments-raghunandan-rao

హైదరాబాద్‌: బిజెపి నేత రఘునందన్ రావుపై రాధా రమణి అనే మహిళ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళలను భయపెట్టి లొంగదీసుకుంటాడని ఆరోపించారు. వారికి మత్తు మందు ఇచ్చి టాలీవుట్ హీరోలు, రాజకీయ నాయకుల వద్దకు పంపిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారితో బ్లూ ఫిలింస్ తీస్తాడని.. ఓ ప్రముఖ హీరో తమ్ముడికి రఘునందనే మహిళలను సరఫరా చేస్తాడని చెప్పారు రాధా రమణి. తన భర్త, రఘునందన్ కలిసి కలిడ్నాప్ చేసి.. తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు. వీరికి డ్రగ్స్ బిజినెస్ కూడా ఉందని ఆమె చెప్పారు. సోమాజి గూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. రఘునందన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి నేత రఘునందన్ రావుపై రాధారమణి అనే మహిళ ఇప్పటికే సైబరాబద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తనపై లైంగిక దాడి చేయడమే గాక.. బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తతో విభేదాల కారణంగా 2003లో స్థానిక పోలీసు స్టేషన్‌ ఫిర్యాదు చేశానని.. న్యాయవాది రఘునందన్ సలహా మేరకు తన భర్తపై మెయింటెనెన్స్ కేసు ఫైల్‌ చేసినట్లు తెలిపారు. ఐతే 2007లో కేసు నిమిత్తం రఘునందన్‌రావు తనను కార్యాలయానికి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/