ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు

ఎలక్ట్రిక్ స్కూటర్లు వారుగా ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే వరుసపెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు పేలుతూ ఉన్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల ఎల‌క్ట్రిక్ బైక్ బ్యాట‌రీలు పెళ్లి ప్రాణాలు పోయాయి. తాజాగా శనివారం తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా, హోసుర్​లో మరో ఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బైక్ లో మంటలు వచ్చి..చూస్తుండగానే కాలి బూడిదయ్యింది. సీట్​ కింద నుంచి మంటలు రావడం గుర్తించిన యజమాని వెంటనే బైక్​ ను పక్కకు నిలిపి వేయడం తో ప్రాణ పాయం తప్పింది.

కర్ణాటక బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న సతీశ్​ కుమార్​ ఈ వాహనాన్ని ఏడాది క్రితం కొనుగోలు చేశారు. అంతకుముందు.. తమిళనాడులోని తిరువళ్లూర్​లో ఓ ఈబైక్​ ఇలాగే ప్రమాదానికి గురైంది. వెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆ బైక్​పైన ప్రయాణిస్తున్న తండ్రీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం తో న్యూ మోడల్స్ ను ప్రవేశ పెట్టవద్దని ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ లకు కేంద్రం సూచింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్న వారు స్కూటర్లను బయటకు తీసేందుకు , ఛార్జింగ్ పెట్టేందుకు భయపడుతున్నారు. కొంతమందైతే వీటిని వాడకుండా పక్కుకు పడేస్తున్నారు.