మల్కన్ గిరి అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పుష్పరాజ్ అలజడి

పుష్పరాజ్..ప్రస్తుతం మల్కన్ గిరి అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నాడు. పుష్ప తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్..ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా ఫై మరింత అంచనాలు పెంచాయి. పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉండబోతుందో ట్రైలర్ లో చెప్పకనే చెప్పాడు సుకుమార్. ఈ ట్రైలర్ విడుదల దగ్గరి నుండి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత మరింతగా పెరిగింది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మల్కన్ గిరి అటవీ సరిహద్దు ప్రాంతాల్లో చేస్తున్నారట. పుష్ప ది రైజ్ చిత్రం మల్కన్గిరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న స్పిల్వే వంతెనపై భారీ సెట్టింగ్స్ తో చిత్రీకరిస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ బృందం ఏప్రిల్ మొదటి వారంలోనే ఒడిశాలో అడుగుపెట్టింది. స్వాభిమాన్ అంచల్ వద్ద మూడు వైపులా నీటితో చుట్టుముట్టబడిన ఏకాంత ప్రదేశంలో షూటింగ్ చేస్తున్నారట. ఈ ప్రాంతాలు ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉండేవి. చాలా మటుకు సినిమా షూటింగ్ మే మొదటి వారంలో పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా రీసెంట్ గా రెండు రోజుల పాటు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లలో ఐటీ దాడులు జరగడం తో షూటింగ్ కు ఏమైనా అంతరాయం ఉంటుందేమో అని అభిమానులు భావిస్తున్నారు. కానీ అలాంటిది ఏమి లేదని మేకర్స్ నుండి సమాచారం అందుతుంది.