తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పుష్ప టీం

పుష్ప చిత్ర యూనిట్ బుధువారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డైరెక్టర్ సుకుమార్ , నటుడు సునీల్ తో పాటు నిర్మాతలు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంత‌రం వారు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ‘పుష్ప’ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో శ్రీ‌వారి స‌న్నిధికి వ‌చ్చామ‌ని ఆ సినిమా యూనిట్ చెప్పింది.

అల్లు అర్జున్ – సుకుమార్ – దేవి శ్రీ కలయిక లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ తో గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్లు రాబడుతూ లాభాల బాట పడుతుంది. నిన్న ఈ మూవీ సక్సెస్ మీట్ ను తిరుపతి లో అట్టహాసంగా జరిపారు. ఇందులో భాగంగా హీరో అల్లుఅర్జున్​, హీరోయిన్ రష్మిక, సునీల్​, అనసూయ, దర్శకుడు సుకుమార్​ పలు ఆసక్తికరమైన సంగతులను చెప్పారు. నాకు వచ్చిన క్రెడిట్​ అంతా సుకుమార్​కే దక్కుతుంది. ఆయనతో పాటు నా సహ నటులందరికీ కూడా. రష్మికతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అదిరిపోయే ఆల్బమ్​ను ఇచ్చిన దేవీశ్రీకి స్పెషల్​ థ్యాంక్స్​. నా ఫ్యాన్స్​ అందరినీ గర్వించేస్థాయికి తీసుకెళ్తాను” అని అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు.