పుష్ప మూవీ డిస్ట్రిబ్యూటర్లు లిస్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ తో పాటు బిజినెస్ ఫై దృష్టి సారించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. మలయాళంలో ఈ4 ఎంటర్టైన్మెంట్ ,తమిళంలో లైకా ప్రొడక్షన్స్ , కన్నడ లో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్, ఏఏ ఫిలిమ్స్ ఇండియాలో, ఓవర్శిస్ లో హంసిని ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటె రీసెంట్ గా విడుదల చేసిన ”ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా” అనే సాంగ్ యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. మరి థియేటర్స్ లో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.