నేషనల్ రికార్డు కొట్టిన పుష్ప..

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆర్య , ఆర్య 2 తర్వాత సుక్కు – బన్నీ – దేవి శ్రీ ల కలయికలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు జరుపుతూ అభిమానుల్లో ఉత్సహం నింపుతుంది. ఇదిలా ఉండగానే తాజాగా పుష్ప మూవీ నేషనల్ రికార్డు నెలకొల్పి వార్తల్లో నిలిచింది.

‘పుష్ప’ సినిమా విడుదలై నిన్నటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి బుక్‌మైషోలో 3.50 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. అంటే అక్షరాలా 35 లక్షల మంది బుక్‌మైషో ద్వారా ఈ సినిమాను వీక్షించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఏ సినిమాకూ ఈ రేంజ్‌లో టికెట్లు అమ్ముడవలేదు. దీంతో బన్నీ మూవీ పేరిట నేషనల్ రికార్డు నమోదైంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ రోల్స్‌ను చేశారు