కొవిడ్‌-19.. సింగపూర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

coronavirus -covid 19
coronavirus -covid 19

సింగపూర్‌: కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) సోకిన రోగులకు వైద్యం అందించడం విషయంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగపూర్ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 50కి చేరుకున్న నేపథ్యంలో కరోనా రోగులకు చికిత్సకు అయిన బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సింగపూర్ వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించింది. సింగపూర్ దేశంలోని పాలీక్లినిక్ లు, క్లినిక్ లు, ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు చికిత్స చేయించుకుంటే వాటి బిల్లులన్నీ చెల్లించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ రోగుల చికిత్సకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/