బూస్టర్ డోస్ తీసుకున్న గవర్నర్ తమిళిసై

అమీర్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నర్ తమిళిసై బూస్టర్ డోస్ తీసుకున్నారు. రీసెంట్ గా కేంద్రం 18 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా బూస్టర్ డోస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తమిళిసై కోరారు. రెండవ డోసు తీసుకోని వాళ్లు కూడా తీసుకోవాలని చెప్పారు. ముందే వర్షాకాలం… జ్వరాలు, వాటర్ బాండ్ డిసీజ్ లు ఎక్కువ వస్తుంటాయన్న గవర్నర్… వాక్సిన్ తీసుకుంటే.. ప్రొటెక్షన్ ఉంటుందని తెలిపారు. 75 రోజుల పాటు బూస్టర్ డోస్ క్యాంపెయిన్ పెట్టినందుకు ప్రధానికి తమిళిసై కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదిలా ఉంటె రేపు భద్రాచలంలో గవర్నర్‌ తమిళిసై పర్యటించనున్నరు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు బాధితులను పరామర్శించారునన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఈరోజు రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని.. అక్కడ నుంచి రైలులో భద్రాచలం వరకూ ప్రయాణించనున్నారు. రేపు సీఎం కేసీఆర్‌ సైతం ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ ఏరియల్ సర్వే కొనసాగనుంది. వరద సహాయక చర్యలను సీఎం పర్యవేక్షించనున్నారు. సీఎం చేపట్టే ఏరియల్‌ సర్వకు సంబంధించిన హెలికాప్టర్ రూట్ సహా తదితర విధివిధినాలను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది.