వేసవి కాలం.. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా?.. ఇవి పాటించాల్సిందే!

చిన్నారుల్లో డీహైడ్రేషన్ నివారణ మార్గాలు

Child health care in the summer
Child health care in the summer

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల్లోనూ శరీరం చల్లగా ఉండేందుకు చర్మం అధిక మొత్తంలో చెమటను ఉత్పత్తి చేస్తుంది.. అయితే, ఇలా చెమట ద్వారా శరీరంలోని నీరు, లవణాలు అధిక మొత్తంలో బయటకు వెళ్ళిపోతే డీహైడ్రేషన్ కు గురవుతాం.. వేసవిలో చిన్నారులు డీహైడ్రేషన్ కు గురవుతున్నారనే విషయాన్ని మనం ముందుగానే గుర్తించవచ్చు.

పిల్లలు నీరసంగా కన్పించటం, నోరు పొడిగా తయారవ్వటం, మూత్ర విసర్జన తక్కువుగా ఉండటం, వాంతులు చేసుకోవటం తో పాటు చిరాగ్గా ఉన్నట్టు కన్పిస్తే… వారు డీహైడ్రేషన్ కు గురవుతున్నటు గుర్తించాలి… ఈ సమయంలో వారిని ఆటలకు కాస్త బ్రేక్ ఇవ్వమని చెప్పాలి.. నీరు, మజ్జిగా, పండ్లు వంటివి వారికి అందించాలి.. అవసరమైతే , వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది..

చిన్న పిల్లలు వేసవిలో డీహైడ్రేషన్ లేదా వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా, వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి… చల్లగా ఉన్న సమయాల్లో తప్పించి మిగిలిన వేళల్లో పిల్లలను ఇంట్లోనే ఆడుకునేలా ప్రోత్సహించాలి..

పిల్లలకు ప్రతి పావు గంట నుంచి 20 నిమిషాల కోసారి గ్లాసు నీటిని తాగమని వారికి అందించాలి.. మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, రుచికరమైన కీరా పండ్ల ముక్కలను నీటిలో వేసి అందించటం వంటివి కూడా రోజులో అప్పుడప్పుడూ ఇస్తూ ఉండాలి… అలాగే నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చ కాయ, తర్బూజా పండ్లను కూడా వారికి ఇవ్వాలి..

వేసవిలో ఎక్కువ సమయం ఆటల్లోనే గడిపే పిల్లల వస్త్ర ధారణ విషయం లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.. వీలైనంత వరకు పిల్లలకు లేత రంగుల్లో ఉన్న నూలు వస్త్రాలనే తొడగాలి.. అవి కూడా వదులుగా ఉండేలా చూసుకోవాలి.. అప్పుడే అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పిల్లలపై పడకుండా ఉంటుంది..

నాలుగు నుంచి అయిదు గంటల పాటు ఏమీ తినకుండా, తాగకుండా పిల్లలు ఉన్నట్లయితే వారు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం వుంది.. కాబట్టి పిల్లలకు సరైన సమయానికి ఆహారం , నీరు అందించటం మనం మర్చిపోకూడదు..

చెలి (మహిళల ప్రత్యేకం ) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/