30 వేల ఇళ్లను సీఎం కెసిఆర్‌ ఎక్కడ కట్టారో చెప్పాలి

ప్రజలకు డబుల్‌ బెడ్రూం ఫ్లాట్లు అందిస్తామంటూ బూటకపు మాటలు

dharmapuri arvind
dharmapuri arvind

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ పేదల పాలిట శాపంగా మారాడని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో గృహ నిర్మాణాలకు కేంద్రం రూ.200 కోట్లు పంపించిందని, కానీ కేసీఆర్ వాటిని ఖర్చుచేయకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు అందిస్తామంటూ బూటకపు మాటలు చెప్పిన కేసీఆర్.. 30 వేల ఇళ్లను ఎక్కడ కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఇళ్లన్నీ ఆకాశంలో కట్టారా? లేక ఫామ్‌హౌస్‌లో కట్టుకున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలోని ఏ రాష్ట్రలోనూ ఇంత దగుల్బాజీ సీఎం లేడంటూ ధర్మపురి అర్వింద్‌ నిప్పులు చెరిగారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/